6 April, 2026 | 4:55 AM

పచ్చని అడవిలో రాజుకున్న కార్చిచ్చు

06-04-2026 01:51 AM

సర్వనాశనం అవుతున్న పర్యావరణం, విలవిలలాడుతున్న వన్యప్రాణులు 

కనిపించని ఫైర్ లైన్, చోద్యం చూస్తున్న అటవీశాఖ 

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): పచ్చని అడవుల్లో కార్చిచ్చు రాజు కొంటోంది. పర్యావరణం సర్వనాశనం కావడంతో పాటు, వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన ఫైర్ లైన్లు మచ్చుకైనా కనిపించడం లేదు. వేసవికాలం సమీపిస్తుంది అడవులు తగలబడటం సర్వసాధారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గుట్టల మీద, అడవుల్లో కార్చిచ్చు రగులుతోంది.

పశువుల కాపర్లు, దూమపాన ప్రియులు నిప్పును ఆర్చకుండా ఎండి కాలిపోయిన ఆకులపై పడవేయడంతో అగ్గి అంటుకోనే మంటలు చెలరేగుతున్నాయని చెప్పుతున్న, తునికాకు సీజన్లో మోడల్ నరికేవేత సమయంలో తునికాకు సేకరణ కాంట్రాక్టర్లే ఎరగళ్లు పెడతారని వాదనలు వినిపిస్తున్నాయి. ఎండాకాలంలో అధికంగా ఉన్న ఉష్ణోగ్రతకు తోడు మానవ తప్పిదాల వల్ల అడవుల్లో మంటలు అంటుకొని మరింత ఉష్ణోగ్రతనీ అధికం చేస్తున్నారు. ప్రధానంగా వన్యప్రాణ సంరక్షణ విభాగం పరిధిలో ఉన్న అడవుల్లోనే మంటలు చెలరేగడంతో వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి.

వన్యప్రాణుల సంరక్షణ కోసం, అడవుల్లో మంటలను అదుపు చేయటానికి ఏర్పాటు చేయాల్సిన ఫైర్ లైన్ మచ్చుకైనా కనిపించకపోవడం అటవీ శాఖ నిర్లప్తతకు నిదర్శనం. కిన్నెరసాని అభయారణ్యంలో గత నెల రోజులుగా నిత్యం కనిపిస్తున్న మంటల దృశ్యాలు అటవీశాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వేసవికాలంలో అడవుల్లో మంటలు చెలరేగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఏజెన్సీ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.