26 February, 2026 | 7:18 AM

అగ్రకులాలపై తిరుగుబాటు తప్పదు!

26-02-2026 02:01 AM
  1. కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాం తి): రాష్ట్రంలో బీసీలపై అగ్ర కులాల దాడులు పెరిగాయని, వీటిని అరికట్టడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. లేదంటే అగ్రకులాలపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణ య్య మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కు మ్మెరలో అగ్రకులాల దాడిలో రెండు నెలల పసిపాప మృతి ఘటన ఆవేదనకు గురిచేస్తున్నదన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్‌లో బాధితులు తలపెట్టిన దీక్షను 14 బీసీ సంఘాల నాయకులు, 200 మంది నా యకులు, కార్యకర్తలు 40 వాహనాలలో వెళ్లి అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు ఆయ న తెలిపారు.

ఈ ఘటనపై తక్షణమే నిష్పాక్షిక, వేగవంతమైన దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠి న చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. ఈ దారుణమైన సంఘటన చూస్తే గతంలో కారంచేడు, చుండూరు, నీరుకొండ దుర్ఘటనలు గుర్తుకొస్తున్నాయన్నారు. మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్ని ముఖ్యంగా పోలీస్, రెవె న్యూ అధికారుల్లో ఎమ్మెల్యే చెప్పినట్లు చేయాలని సీఎం ఆదేశాలు ఇవ్వడం రాజ్యాంగ విరో ధమన్నారు. ఘటనపై పారదర్శక దర్యాప్తు జరపాలని, అవసరమైతే సిట్ నియమించాలని కోరారు.

బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా వర్తించే అన్ని కఠిన చట్టాల ప్రకా రం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కిం గ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ మాట్లాడుతూ.. సీఎం  రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్ర భు త్వం తక్షణమే రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలోని ఒక అర్హుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 

సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మాట్లాడుతూ.. బీసీ వర్గాలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని, ఈ ఘటనను దృష్టి లో ఉంచుకుని ప్రభుత్వం సమగ్ర చట్టసవరణలపై ఆలోచించాలన్నారు. సమావేశంలో  బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ  వర్కింగ్ ప్రెసిడెంట్  నీలం వెంకటేష్ ముదిరాజ్, యువ జన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, పగిల్ల సతీష్, రాం దేవ్, భీం రాజు, శివకు మా ర్ యాదవ్, అంజి గౌడ్ తదితరులున్నారు.