15 June, 2026 | 2:36 AM

వృద్ధుల పట్ల గౌరవం, బాధ్యత భావం పెంపొందించాలి

15-06-2026 01:22 AM

ప్రపంచ వృద్ధుల హింస అవగాహన దినోత్సవం సందర్భంగా వృద్ధుల హక్కుల పరిరక్షణకు పిలుపు

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి

ముషీరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ఈ నెల15న నిర్వహించే ప్రపంచ వృద్ధుల హింస అవగాహన దినోత్సవం(వరల్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే) సంద ర్భంగా వృద్ధుల పట్ల గౌరవం, బాధ్యతాభావం పెంపొందించాలని సామాజిక కార్య కర్త, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఆదివారం అయన ఇక్కడ మాట్లాడుతూ వృద్ధాప్యం ప్రతి మనిషి జీవితంలో సహజమైన దశ అని, వృద్ధులు బాధలు, అవమానాలు లేకుండా ప్రశాంతంగా జీవిం చే హక్కు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పా శ్చాత్య నాగరికత ప్రభావం, ఉద్యోగాల కోసం వలసలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించడం వంటి కారణాలతో కుటుంబ బంధాలు బలహీన పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొంతమంది వృద్ధులను భారంగా భావిస్తూ మాటలతో, ప్రవర్తనతో వేధించే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.

ఈ పరిస్థితులను నివారిం చి, వృద్ధులను సమాజంలో భాగస్వాములుగా గుర్తించి వారి మానవ హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూన్ 15ను ప్రపంచ వృద్ధుల హింస అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తోందని చెప్పారు. దేశంలో వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమం కోసం 2007లో చట్టం అమల్లోకి వచ్చినట్లు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల సంబంధిత చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు.

అయితే వృద్ధుల సమస్యలు కేవలం ప్రభుత్వాలు లేదా కోర్టుల పరిధిలో పరిష్కారమయ్యేవి కాదని, కుటుంబ సభ్యులు ప్రేమ, బాధ్యత, గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పెద్దల పట్ల గౌరవం, నైతిక విలువలు, కుటుంబ బాధ్యతలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సంస్కారం, మానవీయ విలువలు పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాల విలువను గుర్తించి సమాజంలో మానవత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు. వృద్ధుల పట్ల గౌరవం, ఆదరణ పెరిగినప్పుడే ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థ, విలువలతో కూడిన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.