గజ్వేల్ సమీకృత మార్కెట్‌లో షాపింగ్ కాంప్లెక్స్
నిర్మాణం కోసం పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి
గజ్వేల్, జూన్ 13: గజ్వేల్ సమీకృత మార్కెట్‌లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు లెఫ్ట్ పార్కింగ్ ప్లేస్‌ను బస్‌బేకు వినియోగించడానికి గురువారం రాష్ట్ర వ్యవసా య మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పరిశీలించారు. గజ్వేల్ నడిబొడ్డున నిర్మిస్తున్న బస్టాండ్ అసంపూర్తిగా ఉండడంతో బస్సులు రోడ్డుపైనే నిలపాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్న విషయాన్ని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సా రెడ్డి గుర్తించి సమీకృత మార్కెట్ ఎడమ వైపున ఉన్న పార్కింగ్ స్థలం గుండా బస్సు లు వెళ్లేలా అవకాశం కల్పించాలని మార్కెటింగ్ శాఖను కోరారు.
ఈ మేరకు డైరెక్టర్ లక్ష్మీబాయి పరిశీలించారు. అలాగే మార్కెట్‌లోని చేపల దుకాణాల వైపుగా చిరువ్యా పారుల కోసం జీ ప్లస్ వన్ పద్ధతిలో దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఆమె పరిశీలించి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మహర్ష, గజ్వేల్ ఏఎంసీ కార్యదర్శి జాన్‌వెస్లీ, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మొనగారి రాజు, సుభాష్ చంద్రబోస్, సర్దార్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.






