యూపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ
30 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): యూపీఎస్సీ (ప్రిలి మ్స్, మెయిన్స్) పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇవ్వబోతున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి ఆర్ కోటాజీ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని గురువారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదని చెప్పారు. అభ్యర్థులు http:// studycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో జూన్ 13 నుంచి 30 వరకు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం http://studycircle.cgg. gov. in, http://twd.telangana.gov.in వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించారు. 62817 66534 అనే నంబర్‌ను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సంప్రదించవచ్చని చెప్పారు. అభ్యర్థులను ఆబ్జెక్టివ్ టైపు ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.






