02-02-2026 12:54:24 AM
మేడ్చల్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ టాపింగ్ కేసులో సిట్ విచారణకు వెళ్తుండగా షామీర్పేట్ లో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. ఎర్రవల్లిలోనిఫామ్ హౌస్ నుంచి బంజారాహిల్స్ లోని నివాసానికి వెళ్తుండగా షామీర్పేట్ లో కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కెసిఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వం కేసీ ఆర్ ను వేధింపులకు గురిచేస్తోందని రహదారిపై కార్యకర్తలు ధర్నా చేశారు. గౌడవెల్లిలో గోమారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరాజు, సుదర్శన్ రెడ్డి, సంతోష్ భాను, సదానంద్, రాజగోపాల్ రెడ్డి, యుగపతి తదితరులు పాల్గొన్నారు.