02-02-2026 12:54:13 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, ఫిబ్రవరి 1 : కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చిట్యాలలోని పలు వార్డులలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలనకు నాంది పలికింది కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమన్నారు.
చిట్యాల పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పేదల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల ఆర్థిక భద్రత వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు ఉన్నారు.