calender_icon.png 5 August, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ

23-04-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా జెండా ఆవిష్కరణ

బహిరంగ సభ విజయోత్సవానికి వాల్ రైటింగ్

ముషీరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా అన్నా రు. ఈ మేరకు మంగళవారం ముషీరాబాద్‌లో తెలంగాణ జాగృతి నగర నాయకుడు పరకాల మనోజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ విజయవంతానికై వాల్ రైటింగ్, తెలంగాణ జాగృతి జెండా విష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా మాట్లాడుతూ... దేశం లోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా బీఆర్‌ఎస్ ఎదిగిందని, 65లక్షల మంది పార్టీ కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారని అన్నారు.

1200 ఎకరాలలో నిర్వహించే బీఆర్‌ఎస్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లి కేసీఆర్ కు అండగా నిలుస్తామని అన్నారు. ముషీరాబాద్ నియోజక వర్గంలో వాడ వాడల ఎమ్మెల్యే ముఠా గోపాల్ సారధ్యంలో పం డుగ వాతావరణ ఉట్టిపడేలా వాల్ రైటింగ్, జెండా ఆవిష్కరణలు బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, పార్టీ సిద్దాంతాలను ఆశయాలను తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్, కేటీఆర్ లు బహిరంగ సభలో వెల్లడించారని  పేర్కొన్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలో బూత్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ బహిరంగ సభ విజయవంతానికి కృషిచేస్తున్నాం అన్నారు. ఈ సందర్భంగా అతిథులను పరకాల మనోజ్ కుమార్ గౌడ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ అధ్య క్ష, కార్యదర్శులు శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు శివమ ఎదిరాజ్, టెంట్ హౌస్ శ్రీనివాస్, వివిద డివిజన్ల బీఆర్‌ఎస్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు, బల్లా శ్రీనివాస్ రెడ్డి, వల్లాల శ్యామ్ యాదవ్, మాజీ డివిజన్ అధ్యక్షులు శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు.