23-04-2025 12:00:00 AM
జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో బీఎన్‌రెడ్డి నగర్‌లో ధరిత్రి దినోత్సవం
ఎల్బీనగర్, ఏప్రిల్ 23 : జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్స వ వేడుకలను మంగళవారం బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ భూ మిని కాపాడుకుందాం, భూమి పైన ఉన్న చెట్టును కాపాడుకుందాం.. చెట్లను ఆధారంగా చేసుకున్న పశుపక్షులను కాపాడు కుందాం... అంటూ ప్రచారం నిర్వహించారు.
ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల భూమాతకు కలిగే నష్టాలను వివరిస్తూ కాలుష్యాన్ని నివారించాలని అవగాహన కల్పించారు. వ్యవసాయ పొలాల్లో వాడుతున్న రసాయనాలు, సెల్ ఫోన్ రేడియేషన్, నీటిని అధికంగా వాడడం, భూ గర్భ జలాలు అడుగంటి పోవడం,విద్యుత్, పెట్రోల్ సహజ వనరుల దుర్వినియోగం తదితర అంశాలతో పాటు భూసారాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించాల్సిన సహజ పద్ధతులను వివరించారు.
అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్, ఇస్మాయిల్ గురూజీ, సంధ్యారాణి, వెంకటేశ్వర కాలనీ సంఘం అధ్యక్షుడు పి.కృష్ణ, సభ్యులు శిరీష, నరేందర్ గురూజీ, యాదా రామలింగేశ్వరరావు, పెయింటర్స్ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్, నారాయణరావు, శ్రీరాములు, శ్రీనివాసరాజు, వై.పద్మ జ, ఊ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గోపాల్ దాస్ రాము, జాగృతి గ్రీన్ వారియర్స్ జీవన, అక్షిత, పవిత్ర, కృతిక, రుత్విక్, జగజీవనాచారి, జయప్రకాశ్, నిహారిక, మణికంఠ, హారిక, విఘ్నేష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.