calender_icon.png 2 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగిల్ సిగరెట్ రూ.48 !

02-01-2026 12:00:00 AM

పొగాకు ఉత్పత్తులపై 40శాతం జీఎస్టీ 

  1. ఫిబ్రవరి 1 నుంచి వర్తింపు
  2. రూ.18 నుంచి రూ.48 వరకు పెరగనున్న సిగరెట్ ధరలు
  3. ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ అదనం
  4. బీడీల ధరలూ పెరుగుదల

న్యూఢిల్లీ, జనవరి1 :  పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసా లాపై సెస్సు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వర్తించ నుందని తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం.. బీడీలపై 18 శాతం కేంద్రం జీఎస్టీ విధించింది. ఈ పన్నుతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ పెంపు, పొగాకుతో పాటు సం బంధిత ఉత్పత్తులకు ఎక్సైజ్ సుంకం వేసింది.

ఇవన్నీ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలవుతాయి. ఈ పెంపుదల అమలులోకి వచ్చిన తర్వాత సింగిల్ సిగరెట్ ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో ఒక్కో  సిగరెట్ ధర రూ.18నుంచి గరిష్టంగా 48కి చేరనుంది. క్లాస్ ఐస్ బస్ట్, గోల్డ్‌ఫ్లాక్ కింగ్ సైజ్ బ్లూ వంటి ప్రీమియం బ్రాండ్ సిగరేట్లు ఒక్కొక్కటి రూ.34 నుంచి 48 వరకు చేరనుంది.

నష్టాల్లోకి ఐటీసీ షేర్లు.. 

సిగరెట్ కంపెనీలైన ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి ఆ ఉత్పత్తుల ధరలు పెరగనుండటంతో అమ్మకాలు తగ్గనున్నాయనే అంచనాల నేపథ్యం లో ఈ స్టాక్స్ నష్టపోయాయి. బీఎస్‌ఈలో ఐటీసీ షేరు ధర 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. 

రెండు బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదం

పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా రెండు బిల్లులను పార్లమెంట్ డిసెంబర్‌లో ఆమోదించింది. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025’ బిల్లును ఆమోదించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ.. ‘పాన్ మసాలపై ఇప్పటికే 40శాతం జీఎస్టీ విధిస్తు న్నారు. దీనికి సెస్ అదనం. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సమకూరే నిధులను జాతీయ భద్రత బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నాం” అని వెల్లడించారు.