17 April, 2026 | 11:41 AM

Breaking News

సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలి

28-02-2026 12:00 AM
  1. కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
  2. కుమ్మెర ఘటనపై డీజీపీని కోరిన విశారదన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య, కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన దాటి ఘటనపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని కోరుతూ శుక్రవారం బాధితులతో కలిసి పలువురు నేతలు డీజీపీ శివధర్‌రెడ్డిని కలిసి విన్నవించారు. డీజీపీని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, జస్టిస్ ఈశ్వరయ్య, జాగృతి కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారదన్ మహారాజ్ ఉన్నారు.

దాడి చేసిన 8 మంది నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు, హత్య కేసులు నమోదు చేయాలని కోరారు. అవసరమైతే సిట్ నియమించాలని వారు సూచించారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, స్థానికంగా ఆధిపత్య వర్గాల నుంచి ముప్పు ఉన్నందున బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో పోలీసు రక్షణ కల్పిం చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆర్ కృష్ణ య్య, కవిత, విశారదన్ మీడియాతో మాట్లాడుతూ.. కుమ్మెరలో ఘటన గతంలో ఉమ్మ డి రాష్ట్రంలో జరిగిన కారంచేడు, చుండూరు, నీరుకొండ లాంటి మారణకాండలు గుర్తుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పసిబి డ్డపై దాడి యావత్ సమాజం సిగ్గుపడే రా క్షస చర్య అని మండిపడ్డారు. పోలీసు, రెవె న్యూ యంత్రాంగాలు అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనిచేస్తున్నాయని ఆరోపి ంచారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.