1 March, 2026 | 7:58 AM

పాప ప్రాణాన్ని రాజకీయం చేయొద్దు!

28-02-2026 12:00 AM
  1. శిశువు మృతి దురదృష్టకరం

కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఆవేదన

కుమ్మెర ఘటనపై నిజ నిర్ధారణకు కాంగ్రెస్ బృందం

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రా మంలో జరిగిన రెండు నెలల పసిబిడ్డ మృతి ఘటన దురదృష్టకరమని, దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకోవడం సరికాదని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఘటనపై నిజ నిర్ధారణ కోసం ప్రత్యేక బృం దం గ్రామాన్ని సందర్శించింది.

ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో బృందం కుమ్మెర గ్రామానికి చేరుకుని గ్రామ పెద్దలు, యువకులు, మహిళలతో సమావేశమైంది. ఘట నకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి బాధిత కుటుంబ ఇంటి పరిసరాలను పరిశీలించారు. అనంతరం  ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కుమ్మెర జాతర ఘటన విషయంలో సరైన వాస్తవాలను తెలుసుకొని ప్రచారం చేయాలని తప్పు డు ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన రెండు రకాల ఫిర్యాదులోనే అసలు విషయం తెలుస్తున్నదని, బిడ్డ ను పోగొట్టుకున్న విషయంలో అందరూ చింతించాల్సిన విషయమేనన్నారు.  గ్రామ ంలో కుల విపక్ష ఉన్నట్లు ఏ ఒక్కరు చెప్పడం లేదన్నారు. ప్రభుత్వంపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ బురద చల్లాలనే కుట్రలో భాగం అన్నారు. ఈ అంశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ చైర్మన్, విశారదన్ మహరాజ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లేదా ఇతర ప్రజా సంఘాలు తప్పులేదని కేవలం కుమ్మెర గ్రామ మాజీ సర్పంచ్ దుర్బుద్ధి వల్లే ఈ తప్పుడు ప్రచారం జరుగుతున్నదన్నారు. 

బాధిత కుటుంబాన్ని ఆదుకునే పూర్తి బా ధ్యత ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు.  శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రస్తుతం బాధితులకు అండగా నిలిచి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరితో చర్చించి గాంధీభవన్ వేదికగా  చివరగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

పర్యటనలో జాతీయ ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుల్ల రాజేష్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వల్, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్,తదితరులు పాల్గొన్నారు.