2 March, 2026 | 2:47 AM

కుమారుని వివాహ వేడుకకు రండి

28-02-2026 12:00 AM
  1. ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానం

భట్టి విక్రమార్క వెంట మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన భట్టి విక్రమార్క.. తన కుమారుడి వివాహ వేడుకకు రావాల్సిందిగా చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుక జరగ నుంది.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నా యుడుకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన భట్టి విక్రమార్క, తప్పకుండా హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ భేటీలో భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నా రు.

సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం ఏపీ అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని కూడా భట్టి విక్రమార్క కలిశారు. తన కుమారుడి వి వాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేసి, వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అ నంతరం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దర్శించుకున్నారు.