20 March, 2026 | 5:11 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఎర్రచీర దర్శకుడు సీ.హెచ్ సుమన్ బాబు దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రానికి శ్రీకారం

15-11-2024 05:12 PM

ఎర్రచీర  దర్శకుడు సి. హెచ్. సుమన్ బాబు దర్శకత్వంలో మరో అద్భుతమైన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతోంది. దీనిని సోషియో ఫాంటసీ జోనర్లో నిర్మిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఈ చిత్రం టైటిల్ " పరకామణి " ని విడుదల చేశారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ సి.హెచ్. సుమన్ బాబు తెలిపారు. సుమారు రూ.20 కోట్ల నిర్మాణ వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నామన్నారు.

సృష్టిలో ఏడు లోకాలైన అతల, వితల, సుతల, తల తల, రసాతల, పాతాళ లోకాలను చూపిస్తూ, అద్భుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కే ఈ  సోషియో ఫాంటసీ చిత్రం... ప్రేక్షకులకు అధ్భుతమైన అనుభూతిని ఇస్తుందని సుమన్ బాబు తెలిపారు. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు నటిస్తారని, ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు అయితే సుమన్ బాబు నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ఎర్ర చీర డిసెంబర్ 20న విడుదల కానుంది.