28 July, 2026 | 2:50 AM

విమానాశ్రయ నిర్మాణ భూసేకరణకు నిధులు విడుదల

28-07-2026 01:53 AM

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపీ

ఆదిలాబాద్, జూలై ౨౭ (విజయక్రాంతి): ఆదిలాబాద్ లో ఏయిర్ ఫోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,278 కోట్లు విడుదల చేయడం  అభినందనీయమని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. సోమ వారం డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. గత BRS ప్రభుత్వం పదేండ్లలో ఆదిలాబాద్ కు,  రాష్ట్రానికి చేసిందేమి లేదని, కానీ ప్రజా పాలనలో ఆదిలాబాద్ కు విమానశ్రయం నిర్మించడం జరుగుతుందన్నారు. దీంట్లో భాగంగానే నిధులు విడుదల చేసిందన్నారు.

తాను ఎంపీగా ఉన్నప్పుడే ఆదిలాబాద్ కు ఏయిర్ ఫోర్ట్ కోసం ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రులకు ఎన్నో సార్లు కలిసి విన్నవించానన్నారు. కానీ స్థానిక బీజేపీ నాయకులు తామే ఏయిర్ ఫోర్టు తీసికొచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం విడ్డురంగా ఉందన్నారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, పట్టణ అధ్యక్షులు కిజార్ పాషా, ఆత్మ చైర్మన్ గీమ్మ సంతోష్, మైనారిటీ చైర్మన్ షాహిద్, సంజీవ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.