28 June, 2026 | 10:01 AM

భావితరాలకు మంచి పాఠం

26-05-2024 12:05 AM

‘ప్రహరీ గోడకు పరిష్కారం’ శీర్షికన ‘విజయక్రాంతి’ ఎడిట్ పేజీ’లో ప్రచురితమైన ఆచార్య మసన చెన్నప్ప నిజ జీవిత సంఘటన భావి తరాలకు మంచి పాఠం అవుతుంది. ఒకరి ఇంటి స్థలంలోకి కొద్దిగా జరిగి పక్కవారు నిర్మాణాలు జరపడం సర్వసాధారణం. విషయం వెలుగులోకి వచ్చాక జనాలు గొడవ పడతారు. అక్రమంగా కట్టిన గోడలు కూలుస్తారు. లేదా నష్టం పరిహారం అడుగుతారు. కానీ, వివాదాలకు తావు లేకుండా, ఇరుగు పొరుగు సంబంధాల సఖ్యత చెడి పోకుండా తెలివైన పరిష్కారం మొదటిసారి వింటున్నాం.  

 - డా. వెంకటరెడ్డి, పాలమూరు