బస్సుల బాధ తీర్చండి
26-05-2024 12:05 AM
రాజధాని నగరంలో సామాన్యుల ప్రయాణాలకు బస్సులే శరణ్యం. ఆటోల వాళ్లు కూడా రేట్లు రెండింతలు చేశారు. బస్సులేమో చాలినన్ని లేవు. 3,800 బస్సులకు 2842 మాత్రమే తిరుగుతున్నట్టు వార్త వచ్చింది. ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గడం వల్ల ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువవుతున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విశాల దృష్టితో ఆలోచించి బస్సుల సంఖ్యను తక్షణం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. గతంలో పది నిమిషాల వ్యవధికి ఒకటి చొప్పున వచ్చే బస్సులు ఇప్పుడు అరగంట అయినా రావడం లేదంటే పరిస్థితి ఊహించుకోవచ్చు.
- పవన్ కుమార్, ఘట్‌కేసర్






