విద్యార్థుల జీవితాలతో ఆటలా?
26-05-2024 12:05 AM
ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆటాడుకోవడం భావ్యం కాదు. అసలే, పిల్లలు సున్నిత మనస్కులుగా వుంటారు. అనుకున్న దానికంటే ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఎంతో ఫీలై పోయేవారుంటారు. అలాంటిది ఒక విద్యార్థినికి 97 మార్కులకు గాను 77 మార్కులే వేయడం అన్యాయం. ఆ అమ్మాయి మళ్లీ మూల్యాంకనం (రీవెరిఫికేషన్) చేయించడంతో అధికారుల పొరపాటు బయట పడింది. ఈ వార్త ‘విజయక్రాంతి’లో చదివి ఆశ్చర్యపోయాం. ఇక ముందైనా ఇలాంటి తప్పులు జరక్కుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు పడాలి. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోగలిగితే బావుంటుంది.
- డి.నిహిరాదేవి, బంజారాహిల్స్






