పాలిటెక్నిక్ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ఇస్తాం
జహీరాబాద్ ఆగస్టు 22(విజయ క్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం అన్నారు. విద్యార్థులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 97ను ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు విద్యార్థులు పోరాటం కొనసాగిస్తారని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను డిప్లమో దశలోనే అభ్యసిస్తున్న విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యా చట్టం పరిధి నుండి తొలగించడం విద్యార్థులకు తీరని నష్టం వాటిల్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం తీసుకురావడం వల్ల విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. యువత భవిష్యత్తు తమ లక్ష్యం అని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం అదే యువత భవిష్యత్తును నాశనం చేసే జీవో తీసుకురావడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థులు చదువును అభ్యసించకుండా వారి భవిష్యత్తు కోరం రోడ్లపైకి వచ్చి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో చర్చించి వారి సందేహాలను నివృత్తి చేసింది లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన అన్నారు విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అన్నారు. సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్ విద్యా యధాతధంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.






