14 July, 2026 | 4:59 PM

Breaking News

అబాకస్ పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా బ్లూ బెల్స్ విద్యార్థులు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •  

ఆత్మీయంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

28-04-2025 12:53 AM

తుంగతుర్తి, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఆదివారం 20002001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పదోతరగతి వరకు చదివిన విద్యార్థులు 24 ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకొని ఒకరికి ఒకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. అనంతరం తమకు పాఠాలు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆనాటి గురువులు కాసం మల్లయ్య, పాలవరపు సంతోష్, ఆకారపు రాములు, సుదర్శన్, ఓరుగంటి అంతయ్య, ముచ్చ సురేందర్ రావు, ఫజల్, మేనేని మాధవరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు.

ప్రవీణ్ కుమార్, పూర్వ విద్యార్థులు రేగటి భాస్కర్, మల్లెపాక సాయిబాబా, ఎనగందుల రవి, కొమరయ్య, భాషమియా, సురేష్, వెంకన్న, కిరణ్, నిర్మల, మంజుల, ఉప్పలయ్య, కటకం నాగరాజు, వెంకన్న శ్రీకాంత్ గోపగాని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.