12 May, 2026 | 11:24 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

రెడ్ బ్యాగ్ చుట్టూ తిరిగే కథ

04-05-2026 12:27 AM

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ సినిమాకు రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను టీం పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే యాక్షన్ లవర్స్కి ట్రీట్ ఇచ్చేలా సినిమా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రంలో కబీర్ సింగ్ ఓ డిఫరెంట్ పాత్రను పోషిస్తుండగా.. ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి ఇతర పాత్రల్లో నటించారు. త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ మూవీ కి శేఖర్ మోపురి సంగీతమందించగా, ప్రియేశ్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని ఎడిటర్‌గా పని చేశారు.