మహేందర్‌ను పరామర్శించిన సునీల్ రావు
28-08-2026 06:41 PM
ముకరంపుర,(విజయ క్రాంతి): గురువారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై నగరంలోని అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకొని చికిత్స పొందుతున్న బిజెపి నాయకుడు, భగత్ నగర్ కు చెందిన మోతే మహేందర్‌ను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు శుక్రవారం పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేందర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేందర్ కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. మహేందర్ త్వరగా కోలుకుని, మళ్లీ యథావిధిగా తన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేలా ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.






