పల్లె దవాఖాన, పీహెచ్సీ సబ్ సెంటర్ లను వెంటనే తెరవాలి
జోనల్ కమిషనర్ సాంచిత్ గంగ్వార్ కు వినతి
పల్లె దవాఖానకు తాళం వేసే అధికారం ఎక్సైజ్ శాఖకు ఎవరిచ్చారు...?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుడిమెళ్ల మల్లికార్జున్
అల్వాల్,(విజయక్రాంతి): కౌకూర్ ప్రజల కోసం ఏర్పాటు చేసిన పల్లె దవాఖాన, పీహెచ్సీ సబ్ సెంటర్‌ను వెంటనే తెరవాలని మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త తుడిమెళ్ల మల్లికార్జున్ కోరారు. ఈ సమస్యపై గురువారం ఆయన, మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సాంచిత్ గంగ్వార్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు ఇచ్చిన పత్రాన్ని కూడా ఆయనకు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... కౌకూర్ మోడల్ మార్కెట్ భవనాన్ని ఎక్సైజ్ కార్యాలయంగా మార్చడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయం వల్ల ముఖ్యంగా సీజ్ చేసిన వాహనాలను పెద్ద సంఖ్యలో నిల్వ చేయడం, వాహనాల రాకపోకలు పెరగడం, పార్కింగ్ సమస్య, రోడ్లు ఆక్రమించబడే పరిస్థితి, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రం కావడం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
ప్రజలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, పాదచారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలో సీజ్ చేసిన వాహనాలను నిల్వ చేయడం వల్ల ప్రజా భద్రత, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగు తుందని ఆయన తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే ఈ భవనాన్ని ఎక్సైజ్ కార్యాలయానికి కాకుండా వార్డు ఆఫీస్, స్ట్రీట్ లైట్స్ ఆఫీస్, యువతకు జిమ్, విద్యార్థులకు గ్రంథాలయం, సానిటేషన్ కార్యాలయం వంటి ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు.
మాకు దవాఖాన కావాలి – ఎక్సైజ్ ఆఫీస్ వద్దు..!
మాకు ట్రాఫిక్ రహిత కౌకూర్ కావాలి – సీజ్ వాహనాల పార్కింగ్ కాదు!
మోడల్ మార్కెట్ ప్రజల కోసం, ఎక్సైజ్ శాఖ కోసం కాదు. ప్రజా ప్రయోజనా లకు విరుద్ధంగా ఎక్సైజ్ కార్యాలయం ఏర్పాటు చేస్తే కౌకూర్ ప్రజల తరఫున మరింత బలమైన ప్రజా ఉద్యమం చేపడతామని తుడిమెళ్ల మల్లికార్జున్ హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో సీనియర్ న్యాయ వాది మేకల శ్రీనివాస్ యాదవ్, శివరాజ్, ఆసి ఫుల్లా ఖాన్, శంకర్, మహేష్, శ్రీకాంత్ తదితరు లు పాల్గొన్నారు.






