28 August, 2026 | 7:41 PM

Breaking News

మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •   మార్కండేయ మందిరంలో ఘనంగా నూలు పున్నమి ఉత్సవాలు   •   ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన   •   విద్యుత్ అగాధంతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి   •   మైదానంలో గంట.. ఆరోగ్యం మీ వెంట   •   పల్లె దవాఖాన, పీహెచ్సీ సబ్ సెంటర్‌ లను వెంటనే తెరవాలి   •   బాన్సువాడలో నూతన ఎస్ఆర్వో భవన నిర్మాణానికి స్థల పరిశీలన   •  

అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లకు ప్రతీక రక్షాబంధన్

28-08-2026 06:35 PM

తూప్రాన్,(విజయ క్రాంతి): రక్షాబంధన్ ఒక పవిత్రమైన అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ల రక్త సంబంధాలను మెరుగుపరుచుకునే పండుగలలో అతి ప్రాముఖ్యమైనది. ఆప్యాయతలకు అనురాగాలకు పెట్టింది పేరుగా ఇంట్లో ఆడపడుచులు అన్న, తమ్ముళ్లకు రక్షాబంధన్ పర్వదినాన రాఖి కట్టి ప్రేమను చాటుకుంటారు. ఈ నేపథ్యంలో తూప్రాన్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి కుటుంబంలో అనురాగాల సందడి నెలకొన్నది, వారి అక్కలు, చెల్లెలు ఆత్మీయంగా బాబుల్ రెడ్డి కి రాఖీ కట్టి నోరు తీపి చేసుకొని ఆప్యాయతను పంచుకున్నారు.