19 April, 2026 | 2:35 AM

మన చేతుల్లోనే బలమైన కాలేయం

19-04-2026 01:00 AM
  1. మంచి అలవాట్లతో కాపాడుకుందాం
  2. కిమ్స్ ప్రముఖ వైద్యులు కేఎన్ చందన్‌కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాం తి): కాలేయాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడని, ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో వయసుతో సంబం ధం లేకుండా లివర్ ఫెయిల్ అయిన వారిని మనం చూస్తున్నామని, వారిని కాపాడుకోవ డం మన చేతుల్లోనే ఉందని కిమ్స్ ఆసుపత్రి (సికింద్రాబాద్) డైరెక్టర్ హెపటాలజీ అండ్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఫిజిషియన్ హెపటాలజిస్ట్ డాక్టర్ కేఎన్ చందన్‌కుమార్ అన్నారు. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా పలు విషయాలను డా చందన్ కుమార్ పం చుకున్నారు.

భారతదేశంలో ఫ్యాటీలివర్, మెటబాలిక్ లివర్ వ్యాధుల కేంద్రంగా మా రుతుందని, మంచి అలవాట్లు, బలమైన కాలేయం మన రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ప్రతీ ముగ్గురిలో ఒకరి ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైంది. నిరంతరమైన మంచి అలవాట్లు అవసరం. కాలేయం దెబ్బతింటే అలసట, బలహీనత, ఆకలి తగ్గ డం, వాంతులు, కళ్లలో, చర్మంలో పసుపు రంగు (జాండిస్), పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏ అవయవాలు తిరిగి రావు. లివర్ మాత్రమే సాధారణ స్థితికి వ స్తుంది. ఆరోగ్యకరమైన బలమైన కాలేయం కోసం ఐదు సూత్రాలు.

1. సంపూర్ణ ఆహారం: ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, తక్కువ కొవ్వు ప్రోటీన్లు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక చక్కె రల వినియోగాన్ని తగ్గించాలి.

2. రోజూ వ్యాయామం: రోజుకు కనీసం 30నిమిషాల శారీరక చురుకుదనం ఉంటే కాలేయంలో కొవ్వు నివారించవచ్చు.

౩. మద్యాన్ని పూర్తిగా మానేయాలి.

5. ముందుగానే పరీక్షలు: లివర్ సమస్యలు చాలాసార్లు లక్షణాలు లేకుండా (సైలెంట్) ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్‌తో ముందుగానే గుర్తించాలి.

6. కొవ్వు తగ్గించాలి: సెంట్రల్ ఒబేసిటీ తగ్గించడం, స్కెలెటల్ మసిల్ మాస్ పెంచ డం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది లివర్ ఆరోగ్యానికేకాదు, మధుమేహం,                    రక్తపోటు,  కొలె స్ట్రాల్, గుండెజబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ ప్ర మాదాలను కూడా తగ్గిస్తుంది.