27 August, 2026 | 4:18 AM

కారుకు కలిసొస్తున్న.. కాంగ్రెస్ కొట్లాటలు!

27-08-2026 02:16 AM

పాలకపక్ష నేతల నోట ప్రతిపక్ష ఆరోపణలు

  1. ఒకవైపు అంతర్గత పోరు.. మరోవైపు అసమ్మతి రాగం 
  2. అసంతృప్తిని రాజకీయ అస్త్రంగా మలచుకుంటున్న బీఆర్‌ఎస్

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో(Telangana politics) కీలకమైన చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష బీఆర్‌ఎస్(BRS) మధ్య పోరు క్రమంగా మరో దశకు చేరుతోంది. కాంగ్రెస్‌లోని కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా అస్త్రాలుగా  మారుతున్నాయి.

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్ ఇప్పటివరకు చేస్తున్న విమర్శలకు.. కాంగ్రెస్ నేతల(Congress leaders) నుంచే వస్తున్న అసంతృప్తి స్వరాలు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలే బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయనే రాజకీయ చర్చ(Political discussion) మొదలైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు పాలనపై ప్రతిపక్షాల విమర్శలు.. మరోవైపు పార్టీ అంత ర్గతంగా ఉత్పన్నమవుతున్న అసంతృప్తి.. ఇంకోవైపు స్థానిక స్థాయిలో నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయ సమస్యలు ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బంది కరంగా మారుతున్నాయి.

ఈ పరిణామాలన్నింటినీ బీఆర్‌ఎస్ నిశితంగా గమనిస్తూ.. ఒక్కో అంశాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకునే ప్రయ త్నం చేస్తోంది. హామీల అమలు, రైతు సమస్యలు(Farmers Issues), సంక్షేమ పథకాలు(Welfare Schemes), ఉద్యోగాలు(Jobs), నిరుద్యోగ సమస్య(The problem of unemployment), అభివృద్ధి(Development), ప్రాజెక్టులు(Projects), స్థానిక సమస్యలు.. ఇలా అనేక అంశాల్లో బీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.

అదే అంశాలపై అధికార పార్టీకి చెం దిన నేతలే ప్రశ్నిస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వంపై తాము చేసిన ఆరోపణలన్నీ వాస్తవాలే అనే ప్రచారాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇదే బీఆర్‌ఎస్‌కు ప్రధాన రాజకీయ ఆయుధంగా మారుతోంది. 

తలనొప్పిగా అసమ్మతి రాగం..

కాంగ్రెస్‌లో అంతర్గతంగా నెలకొంటున్న అసమ్మతి కూడా ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారుతోంది. అధికారంలో ఉన్న పార్టీకి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమే అయినా.. అవి బహిరంగ వేదికలకు చేరినప్పుడు సమస్యగా మారతాయి. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలు, అటు సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి.. ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామం ప్రస్తుతం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతోంది.

ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు, మంత్రుల పనితీరు, నియోజకవర్గాల అభివృద్ధి, నిధుల కేటాయింపు, అధికారుల వ్యవహారశైలి, పార్టీ నాయకత్వం వంటి అంశాలపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తమైతే అది ప్రతిపక్షానికి ప్రచార సామగ్రిగా మారుతుంది. బీఆర్‌ఎస్ ఇప్పుడు ఇదే అంశంపై దృష్టి పెడుతోంది.

కాంగ్రెస్‌లో ఎవరెవరు ఏ అంశంపై అసంతృప్తిగా ఉన్నారు? ఏ నేత ఏ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎక్కడ అంతర్గత విభేదాలు ఉన్నాయి? ఏ నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయం లేదు? వంటి అంశాలను విస్తృత రాజకీయ అంశంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై గతంలో తాము చేసిన విమర్శలను ఇప్పుడు కాంగ్రెస్‌లోని నేతలే ప్రశ్నిస్తున్నారని ప్రజలకు వివరించేలా వ్యూహరచన చేస్తుంది.

ప్రతిపక్షం చేసిన ఆరోపణలను ప్రభుత్వం తిరస్కరించిన సందర్భాలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు అదే అంశాలపై అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ప్రచారం చేయడం ద్వారా తమ వాదనలకు విశ్వసనీయత తీసుకురావాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అయితే ఇది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నంగా మారే అవకాశం ఉంది. 

ప్రభుత్వంపై అసంతృప్తే లక్ష్యంగా..

ఈ వ్యూహంలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కీలకంగా ఉపయోగి స్తోంది. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు సంబం ధించిన వీడియోలు, ఇంటర్వ్యూలు, బహిరంగ ప్రకటనలను బీఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. గతంలో బీఆర్‌ఎస్ చేసిన విమర్శలకు సంబంధించిన పాత వీడియోలను, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో కలిపి ప్రచారం చేయడం ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తున్నది.

అయితే ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ చేసే విమర్శల కంటే.. అధికార పార్టీనేతల వ్యాఖ్యలే ప్రజల్లో ఎక్కు వ చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ రాజకీయ ప్రచారానికి కంటెంట్‌గా మారుతున్నాయి.

దీంతోపాటు ఇప్పటివరకు ప్రభుత్వ నిర్ణయాలను నేరుగా విమర్శించడం ప్రధానంగా ఉండగా.. ఇకపై ప్రభుత్వం పై అసంతృప్తిగా ఉన్న వర్గాలను, కాంగ్రెస్‌తో అసంతృప్తితో ఉన్న నేతలను, పార్టీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని కూడా రాజకీయ చర్చలోకి తీసుకు రావడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నది. బయట నుంచి బీఆర్‌ఎస్ విమర్శ లు చేస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్‌లోని అసంతృప్తి స్వ రాలను ముందుకు తెస్తుంది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు రెండువైపుల నుంచి వస్తు న్నట్లుగా రాజకీయ వేడి ఏర్పడుతుంది. 

బాధితుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం 

ఈ క్రమంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22 ఏ నిషేధిత భూముల అంశం, పాలిటెక్నిక్ విద్యార్థు లను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసువచ్చే అంశాలకు సంబంధించిన బాధితుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం చేస్తున్నది. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశాన్ని కూడా భుజాన వేసుకుంది. ఒకవైపు 22 ఏ నిషేధిత జాబితా బాధితులను స్వయంగా కలిసి వారి ఆవేదనను పంచుకుంటూ వారికి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున భరోసా అందిస్తోంది.

దీంతోపాటు పాలిటెక్నిక్ విద్యార్థుల చేపట్టిన నిరసన, ధర్నా కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు పాల్గొంటూ విద్యా ర్థులకు అండగా నిలుస్తున్నారు. తద్వారా ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ గళం విప్పుతూనే ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొ స్తున్నది.

ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ఒకవైపు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ.. మరోవైపు కాంగ్రెస్‌లోని అసంతృప్తిని హైలైట్ చేస్తున్నది. దీంతో కాంగ్రెస్‌లోని అంతర్గత పోరు బీఆర్‌ఎస్‌కు రాజకీయ ఆక్సిజన్‌గా మారుతుందా?, సొంత పార్టీ నేతల అసంతృప్తిని ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తుంది?, బీఆర్‌ఎస్ ఈ అసంతృప్తిని ఎంతవరకు ప్రజా వ్యతిరేకతగా మార్చగలుగుతుంది? అన్నది తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన చర్చగా మారింది.