సరైన అలవాట్లే కాలేయానికి ఆరోగ్యం
కామినేని ఆసుపత్రి డాక్టర్ ఏవీ కృష్ణ చైతన్య
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాం తి): మనిషి శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. 500 కీలక పను లను నిర్వహిస్తుంది. మారుతున్న జీవన శైలి కారణంగా కాలేయ సమస్యలు పెరుగుతున్నాయని కామినేని ఆసుపత్రి (ఎల్బీనగర్), సీనియర్ కన్స ల్టెంట్ అండ్ డైరెక్టర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ హెచ్‌పీబీ సర్జరీ డా క్టర్ ఏవీ కృష్ణ చైతన్య తెలిపారు.
వరల్డ్ లివర్ డే సందర్భంగా అభిప్రాయాలను పంచుకున్నారు. లివ ర్ సమస్యల్లో ప్రధానంగా ఫ్యాటీ లివర్ సమస్య కనిపిస్తుంది. దీనికి వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లు, శరీర బరువు పెర గడం వంటివి ముఖ్య కారణాలు. ఇది తొలుత లక్షణాలు చూపకపోయినా క్రమంగా కాలేయ క్యాన్స ర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. భారత్‌లో 38.9 శాతం మందిలో ఈ సమస్య ఉంది. ప్రతీయేటా 2.6లక్షల మంది ఫ్యాటీ లివర్ సమస్య వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. 1990 నుంచి 2021 వరకు 169 శా తం పెరిగింది. జీవనశైలి మార్పులతో దీర్ఘకాలికంగా మంచి ఫలి తాలు పొందొచ్చు.
నివారణ సాధ్యమే. బ్రౌన్‌రైస్, సిరిధాన్యాలు, పప్పు లు, గింజలు, నట్స్, తకకువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం మం చిది. నూనె, నెయ్యి, వెన్న వా డకాన్ని తగ్గించాలి. ఆకుకూరలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అల్లం, ఉసిరి, వెల్లుల్లి పదార్థా లు మితంగా వాడితే కాలేయానికి మేలు చేస్తా యి. శారీరక చురుకుదనం, వ్యాయామం కాలేయ ఆరో గ్యానికి చాలా అవసరం.
మద్యం కాలేయానికి నష్టమే. ‘సేఫ్ లిమిట్’ అనేది సరైన భావన కాదు. కాలేయ సమస్యలు ఉన్నవారు నిరంతరం ఆరో గ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. చిన్న మార్పులు పెద్ద ఫలితా న్ని ఇస్తాయి. మంచి అలవాట్లతో కాలేయాన్ని కాపాడుకోవచ్చు. పెద్ద సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన కాలేయం ఉంటే మంచి జీవితం సాధ్యమని డాక్టర్ ఏవీ కృష్ణ చైతన్య తెలిపారు.






