రక్షాబంధన్ కానుకగా ఈత!
శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక బాలీవుడ్ బయోపిక్ ‘ఈత’. ‘లూకా చుప్పి’, ‘మిమి’, ‘ఛావా’ చిత్రాల ఫేమ్ లక్ష్మ ణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మ్యాడాక్ ఫిలిమ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని ఇదే ఏడాది రక్షాబంధన్ కానుకగా ఆగస్టు 28న విడుదల చేయన్నారు. 1940 నుంచి 1990 మధ్యకాలంలో ప్రముఖ మరాఠా జానపద కళాకారిణి విఠాబాయి నారాయ ణగాంకర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
తమా షా డ్యాన్స్, లావణీ నృత్య సామ్రా జ్ఞి అయిన ఆమె జీవితంలోని ఎత్తుపల్లాలు, ఎదుర్కొన్న సవాళ్లతో పాటు ఆమె సాధించిన విజయాలను ఈ చిత్రం లో చూపించనున్నారు. ఇందులో విఠాబాయి పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా లావణీ నృత్యం నేర్చుకోవటం విశేషం. ఇందులో విఠాబాయి భర్త పాత్రను రణదీప్ హుడా పోషిస్తుండగా.. మహ్మద్ జీషన్ అయ్యూబ్, నానా పటేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






