ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నింధితులకు శిక్ష పడేలా కృషి చేయాలి
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం మే 12 (విజయ క్రాంతి): ప్రతీ కేసులో ’క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఎస్పీ రోహిత్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించా రు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. పెట్రోలింగ్,బ్లూ కోలట్స్ వాహనాలతో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.గంజాయి వంటి మత్తు పదార్ధాలు,మట్కా,జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్స్ ను గుర్తించి గంజాయిని రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించి తమ తమ నివాస ప్రాంతాల్లో వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చేయాలని తెలిపారు..రాబోయే వర్షాకాలంలో అధిక వర్షాలు సంభవించినపుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు.. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపా రు.ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి మరియు జిల్లాలోని ఇన్స్పెక్టర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.






