13-05-2025 12:11:31 AM
ప్రజావాణిలో అధికారుల తీరు పట్ల అసంతృప్తి
నాగర్ కర్నూల్ మే 12 (విజయక్రాంతి) తమ భూమి కబ్జాకు గురైందని ఎన్నో మార్లు మండల డివిజన్ జిల్లా స్థాయి అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ తమ గోడు వినట్లేదని నిరసిస్తూ సోమవారం యువ రైతు దంపతులు ప్రజావాణి వద్దకు పాదయాత్రగా వచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన రాత్లావత్ రవి గీత దంపతులు తమ మూడెకరాల భూమిలో ఎకరం భూమి ఇతరులు కబ్జా చేశారని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ శివారులోని 243 సర్వే నెంబర్లో మొత్తం 11 ఎకరాల భూమికి గాను గతంలో ఆరు ఎకరాలు, మరో 2ఎకరాలు గత 20ఏళ్ల క్రితం వారి పెద్దలు అమ్ముకున్నారు. మిగిలిన 3ఎకరాలు వరసత్వంగా వచ్చినట్లు తెలిపారు. కాగా మరో ఎకరం పొలాన్ని ఇతరులు కబ్జా చేశారని మండల తహసీల్దార్, డివిజన్ స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులకు కూడా మోర పెట్టుకున్నామని సర్వే చేయించి హద్దు రాళ్లను పాతినా భూ కబ్జా దారులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజావాణిలోని అధికారులు కూడా అలసత్వంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 కిలోమీటర్లు కాలినడకన నడిచిన నొప్పి కలగలేదని ప్రజావాణిలో అధికారులు మాట్లాడిన మాటకి గుండెలో బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమలాంటి భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.