calender_icon.png 13 May, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ కోచింగ్ క్యాంపు ప్రారంభించిన ఎస్పీ

13-05-2025 12:12:27 AM

మెదక్, మే 12: మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో లాంగ్ టర్మ్ క్రికెట్ కోచింగ్ క్యాంపును జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సోమవారం ప్రారంభించారు. జాతీయ క్రీడాకారుడు, కానిస్టేబుల్ సాయి ఆధ్వర్యంలో ఈ కోచింగ్ క్యాంప్ నడుస్తుందని అన్నారు.

పేద పిల్లలు,పోలీస్ సిబ్బంది పిల్లలు ఈ కోచింగ్ క్యాంపులో  పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, మెదక్ టౌన్ సీఐ నాగరాజు, ఆర్‌ఐ శైలందర్ , సిబ్బంది పాల్గొన్నారు.