స్పీకర్ వ్యవస్థకే బెదిరింపులా?
- శాసించడానికి ప్రతిపక్ష నేతలెవరు?
- హరీశ్‌పై మంత్రి దుద్దిళ్ల ఫైర్
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ వ్యవస్థ(Speaker system)ను బెదిరించేలా మాజీమంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశించి హరీశ్‌రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో హరీశ్‌రావు వ్యాఖ్యలపై శ్రీధర్‌బాబు(Sridhar Babu) మాట్లాడుతూ సభను ఏ విధంగా నడపాలనే దానిపై స్పీకర్‌ను నిర్దేశిస్తూ, ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని శాసించడానికి ప్రతిపక్ష నేతలెవరని ప్రశ్నించారు.
స్పీకర్‌పై అనుచిత వ్యా ఖ్యలు చేసిన వ్యవహారంలో ఏదో అనుకుంటే లేదా భావిస్తే అన్న చర్చలకు తావులే దని, ఏం జరిగిందనేది వీడియోల్లో అత్యంత స్పష్టంగా రికార్డ్ కనిపిస్తోందని తేల్చిచెప్పారు. మహిళా ప్రజాప్రతినిధులపై(Women representatives) జరిగిన సంఘటనలకు ప్రభుత్వం లేదా స్పీకర్ ప్రా ధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలను శ్రీధర్‌బాబు కొట్టిపారేశారు. ఆ ఘటనపై ఇప్పటికే పూర్తి నివేదిక సమర్పించాలని శాసనసభాప తి స్వయంగా ఆదేశాలు జారీచేశారని స్ప ష్టంచేశారు.
మహిళా ఎమ్మెల్యేల అంశాన్ని చూపిస్తూ, అదే సమయంలో స్పీకర్‌ను నేరు గా అవమానించిన అత్యంత తీవ్రమైన పరిణామాన్ని అసలు పట్టించుకోవద్దని ప్రతిపక్ష నేతలు మాట్లాడటం వారి ద్వం ద్వనీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఉన్నతమైన స్పీకర్ వ్యవస్థపై దాడి జరిగిన వ్యవహా రాన్ని పక్కన పెట్టాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చట్టసభ నిబంధనల ప్రకారం స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.