27 July, 2026 | 6:31 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

దంచి కొట్టిన వాన..

05-06-2026 01:21 AM
  1. ఈదురు గాలులతో పలుచోట్ల లేచిపోయిన ఇంటి పైకప్పులు
  2. ఆదుకోవాలంటున్న బాధితులు

కుమ్రం భీం ఆసిఫాబాద్ .జూన్4(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షం ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించింది. గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వర్షంతో ఊరట పొందారు. వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహించగా, కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచింది. 

ఆసిఫాబాద్ మండలంలోని కోసారా గ్రామంలో ఈదురు గాలుల బీభత్సానికి చౌహన్ దేవిదాస్ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇంట్లో సామగ్రి తడిసి నష్టపోయిందని బాధిత కుటుంబం తెలిపింది. ప్రభుత్వం, అధికారులు స్పందించి తక్షణ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో కూడా బలమైన గాలులతో చెట్ల కొమ్మలు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు. భారీ వర్షంతో విద్యుత్ సరఫరాకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.ఎండల తీవ్రత తగ్గడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. దూకి దున్నిన చేను లకు వర్షాలు ఉపయోగపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.