మహిళా సాధికారకతకు కృషి
భైంసా ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో మహిళా సంఘాలను బలోపేతం చేసి మహిళా సాధికారతకు కృషి చేయడం జరుగుతుందని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేలజిల్లా కలెక్టర్ భవే ష్ మిశ్రా అన్నారు. కుంటాల మండల కేంద్రంలో గురువారం గ్రామ మహిళా సంఘ భవనం ఆర్థిక సాధికారత కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినించుకోవాలన్నారు.
వ్యవసాయ రంగంలో మహిళలు రాణించడం అభినందనీయమన్నారు. యాంద్రీకరణ పంట మార్పిడి పద్ధతులు పాటించాలని సాంకేతిక విజ్ఞానం సేంద్రియ ఎరులతో పంటలు పండించే విధానం పై మహిళలు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు.






