17 April, 2026 | 10:32 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కినప్పుడే అంబేద్క ర్‌కు నిజమైన నివాళి

15-04-2025 12:00 AM

గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ..

ముషీరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): చట్ట సభల్లో బీసీలకు రిజర్వేన్ అమలైనప్పుడే అంబేడ్కర్ కు నిజమైన నివాళి అని గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్  అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యేలికట్టే విజయకుమార్ గౌడ్ లు అన్నారు. ఈ మేరకు సోమవారం డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ 134వ జయంతిని సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలాలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం చిక్కడపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చట్ట బద్దం చేస్తూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించడం జరిగింది అన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్లో కేంద్ర ప్రభుత్వం చర్చించకుండా కుట్రలు చేస్తుంది అన్నారు. తక్షణమే పార్లమెంట్లో తీర్మానం చేసినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో ఎమ్బి రమణ, అంబాల నారాయణ గౌడ్, మేకపోతుల నరేందర్ గౌడ్, ఎస్. దుర్గయ్య గౌడ్, సింగం నాగేశ్వర్ గౌడ్ పోతగాని ఐలయ్య, వి. నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

నివాళులర్పించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్

ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన జయంతి వేడుకల్లో బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నాగేష్ ముదిరాజ్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు జెల్ల భిక్షపతి, నాగభూషణం, శ్రీను, రాజేష్, నాగ సాయి, రమేష్ పాల్గొన్నారు.