18 April, 2026 | 12:08 AM

రూ.8.55 లక్షల ఎల్వోసీలు అందజేత

15-04-2025 12:00 AM

వారాసిగూడ, ఏప్రిల్ 14: సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ఐదుగురికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.8.55 లక్ష ల విలువచేసే ఎల్వోసీలను సీతాఫలమండిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు భారంగా మారిన దశలో వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. నిమ్స్‌లో రోగులు చికిత్స పొందేందుకు వీలుగా ఈ పత్రాలను అందించామని పేర్కొన్నారు.