30 August, 2026 | 10:08 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

23-06-2025 01:46 AM

- 28 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం

- తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కోశాధికారి చంద్రన్న ప్రసాద్

ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 28 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జేఏసీ కోశాధికారి చంద్రన్న ప్రసాద్ తెలిపారు.

ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్  లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలతో కలసి ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల ను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. అలాగే 250 గజాల ఇంటి స్థలం తో పాటు నాలుగు గదుల ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నారు. నెలకు రూ.30 వేల గౌరవ వేతనాన్ని ప్రతి నెల ఇవ్వాలన్నారు.

మలిదశలో అమరులైన 1200 మందిలో కొంద రికి సహాయం గత ప్రభుత్వం చేయగా, మిగిలిన కుటుంబాలకు రూ.10 లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. అమరవీరుల స్మృతి వనంను 100 ఎకరాలలో ఏర్పాటు చేయాలన్నారు. ఆర్థికంగా, మానసికంగా అన్ని రకాలుగా నష్టపోయి చేసుకునే వృత్తులు, పనులు పోయా యి కనుక వారికి 50 శాతం సబ్సిడీతో కూ డిన రూ.1 కోటి వ్యాపారం నిమిత్తం ఆర్థిక సహాయం ప్రభుత్వమే నేరుగా అందించాలన్నారు.

అలాగే రూ.20 లక్షల సామా న్య, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యమ కళాకారులకు ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు కల్పించి సాంస్కృతిక పాలసీని ప్రకటించాలన్నారు. అమరులైన ఉద్యమకా రులకు ఆయా జిల్లాల్లో స్మారక భవనం నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకు లు గోధుమల కుమారస్వామి, కుసుమ సిద్ధారెడ్డి, సురుడు ప్రభాక ర్, ఓవిరాల సుజ్జి, బట్టారి ఆంజనేయ స్వా మి, మోహన్ బైరాగి, వేముల యాదగిరి, గడ్డం సదానందం, సర్గ మల్లయ్య పాల్గొన్నారు.