బీసీల సంక్షేమానికి ఆద్యుడు
హైదరాబాద్ రాష్ట్రంలో పేద వెనుకబడ్డ తరగతుల ప్రజలు దుర్భర పరిస్థితుల్లో జీవి స్తుండే వారు. వీరి అభ్యున్నతి కోసం మొదటిసారిగా గళమెత్తి ఉద్యమాలు చేసిన మహనుభావుడు కృష్ణస్వామి ముదిరాజ్. మాడపాటి హనుమంతరావు మొదలైన సంఘ సేవకులతో కలిసి ‘ఆల్ హైదరాబాద్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అసోసియేషన్’ను ఆయన స్థాపించారు. వెనుకబడిన వర్గాలను జాగృతం చేసి సామా జిక, ఆర్థిక న్యాయం కోసం సంస్థ ఉపాధ్యక్షులుగా కృషి చేశారు. స్వతహాగా కృష్ణస్వామి ముదిరాజ్ అయినప్పటికీ బీసీ కులాల బాగుకోసం కృషి చేశారు. యాదవ జనసంఘం, మున్నూరు కాపు సంఘాల స్థాపనకు కృషి చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలోని వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం ‘హైదరాబాద్ స్టేట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిటీ’ స్థాపనకు అవిరళ కృషి చేశారు. కృష్ణస్వామి బీసీలకు అందించిన సేవలకు గుర్తింపుగా ‘బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అడ్వయిజర్ బోర్డు’ సభ్యులుగా నియమితులయ్యారు.
‘ముదిరాజ్ మహాసభ’ వ్యవస్థాపక నేత
రాష్ట్ర స్థాయిలో ‘ముదిరాజ్ మహాసభ’ ఏర్పాటుకు కృషి చేసిన గొప్ప వ్యక్తులలో కృష్ణస్వామి ముదిరాజ్ అగ్రగణ్యులు. నేడు ఆంధ్రప్రదేశ్ మహాసభ, ఆల్ ఇండియా ముదిరాజ్ మహాసభ, అఖిల భారత్ ముదిరాజ్ కోలీ మహాసభ మొదలైన పేర్లతో దేశంలోని కోట్లాదిమంది ముదిరాజ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల ఏర్పాటు కృష్ణస్వామి కృషి షలితమే.
1922 సెప్టెంబర్ 30వ తేదీన ‘ముదిరాజ్ (ముక్తరాజ) మహా సంఘం’ దక్షణ హైదరాబాద్ పేరున శ్రీ కృష్ణస్వామి ముదిరాజ్ ఆర్.కేశవ ముదిరాజ్‌తో కలిసి సంఘాన్ని స్థాపించారు. రాష్ట్రం నలుమూలలా పర్యటించి గ్రామగ్రామంలో ముదిరాజుల స్థితిగతుల గురించిన వాస్తవాలను సేకరించి చెదరీల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ముదిరాజ్ జాతిలో సాంఘిక, రాజకీయ చైతన్యం తెచ్చి సంఘం పటిష్ఠతకు కృషి చేశారు. 1961లో ‘ముదిరాజ్ మహాసభ’ అధ్యక్షులుగా ముదిరాజ్ జాతిని ‘ముదిరాజులు’గా నామకరణం చేసి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింప చేశారు. ముదిరాజ్ జాతి పెద్దలతో కలిసి సంఘం కోసం కృషి చేశారు.
1941 మే నెల 26, 27, 28 తేదీలలో ‘నిజాం రాజ్య ముదిరాజ్ మహాసభ’ ప్రథమ సమ్మేళనాన్ని కాచిగూడలోని తుల్జాభవన్‌లో వైభవోపేతంగా నిర్వహించారు. హైదరాబాద్ రాష్ట్రం నలుమూలలు, మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో ముదిరాజ్ కులజనులు తరలి వచ్చి సమ్మేళనాన్ని జయప్రదం చేశారు. సభ విజయవంతానికి కేశవులు, బి.వెంకట్రావ్, బి.వెంకటస్వామి, బి.రంగయ్య, డాక్టర్ సూర్యనారాయణ, చింతల వెంకట నరసయ్య, నవాడ ముత్తయ్య, యం.బలవంతరావులు కృషి చేశారు. ఈ సమ్మేళనంలో ‘హైదరాబాద్ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ’ అధ్యక్షులుగా కృష్ణస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణస్వామి అధ్యక్షతన కార్యవర్గం సమావేశమై ముదిరాజ్‌ల అభ్యున్నతి కోసం 22 తీర్మానాలను ఆమోదించారు.
1954లో ‘అఖిల భారత ముదిరాజ్ ప్రథమ మహాసభ’ సుల్తాన్‌బజార్‌లోని నవజీవన మండలి ఆవర ణలో జరిగింది. బి.రంగయ్య, బి.వెంకటస్వామి, శ్రీమతి సామ్రాజ్యలక్ష్మిమొదలైన ముదిరాజ్ పెద్దలతో కలిసి కృష్ణస్వామి పూనా, షోలాపూర్, బొంబాయి, మద్రాస్, నాగపూర్, మధ్యప్రదేశ్, బెంగళూరు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రదేశాలలో పర్యటించి వివిధ పేర్లతో పిలువబడుతున్న ముదిరాజ్ కులస్తులను ఏకం చేసి ‘అఖిల భారత ముదిరాజ్ మహాసభ’ సమ్మేళనంలో పాల్గొనేలా కృషి చేశారు.
ఈ సమ్మేళనంలో కృష్ణస్వామి ముదిరాజ్ ‘అఖిల భారత ముదిరాజ్ మహా సభ’ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1922 నుండి 1961 వరకు అర్థ శతాబ్ది కాలం ‘ముదిరాజ్ మహాసభ’కు వివిధ హెూదాలలో అధ్యక్షులుగా కృష్ణస్వామి పని చేసి ముదిరాజ్‌లను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దారు. 1961లో కృష్ణస్వామి నేతృత్వంలో ‘అఖిల భారత ముదిరాజ్ మహా సమ్మేళనం’, ‘ఆంధ్రప్రదే శ్ ముదిరాజ్ మహాసభ సమ్మేళనాలు’ జూన్ 3, 4, 5 తేదీలలో వైభవంగా జరిగాయి. ఈ సమ్మేళనంలో కృష్ణస్వామి అధ్యక్ష పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని ‘ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ’ అధ్యక్షులుగా ఎన్. పోచయ్య ఎన్నికకు మార్గం సుగమం చేశారు. అలాగే, డాక్టర్ ఎం. లక్ష్మీ నర్సయ్య ‘అఖిల భారత ముదిరాజ్ మహాసభ’ అధ్యక్షులుగా నియుక్తులయ్యారు.
చిరస్మరణీయం కృష్ణస్వామి సేవా దృక్పథం
పెత్తందార్ల ఉక్కుపాదాల కింద నలిగిపోయే అభాగ్యులను, బడుగు బలహీన పేద వర్గాలను చిన్ననాటి నుండి కృష్ణస్వామి దయతో ఆదుకునేవారు. వారి సేవకు నిరంతరం తపించేవారు, శ్రమించేవారు. బలహీన వర్గాల సేవకు జీవితాన్ని అంకితం చేశారు. 1917లో హైదరాబాద్ రాష్ట్రంలో విషజ్వరం సోకి వేలాది మంది అంటువ్యాధుల బారిన పడినప్పుడు సహాయ బృందంలో చేరి రోగులకు రాత్రింపగళ్లు సేవలందించారు. 1918లో నాందేడ్ జిల్లాలో జరిగిన ‘సోషియల్ సర్వీస్ కాన్ఫరెన్స్’లో కృష్ణస్వామి పాల్గొన్నారు. ఆ సమావేశంలో వర్కింగ్ కమిటీ సబ్యులుగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1921, 1923, 1927లో కాన్ఫరెన్స్‌లు వైభవంగా నిర్వహించా రు. ‘జీవరక్షా ప్రచార మండలి’ని ఏర్పాటు చేసి జాయింట్ సెక్రటరీగా సేవలు అందించారు.
గణేష్ చతుర్థి, కృష్ణస్వామి, విజయదశమి పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహింపజేయడమేకాక జీవరక్షా ప్రచారం చేసి జాతిని జాగృతం చేశారు. ‘హైదరాబాద్ హెల్త్ లీగ్’ను స్థాపించి ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రచారం చేశారు. ‘ఆంధ్ర వలంటీర్ కోర్ కెప్టెన్’గా కృష్ణస్వామి ఎన్నికై నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. అలాగే, ‘యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ కమిటీ మెంబర్’గానూ సేవలు అందించా రు. 1926లో స్వామి జగద్గురు అనంతాచారి అధ్యక్షత న రెసిడెన్సీలో ‘శ్రీ విష్ణు కాన్ఫరెన్స్’ అనే సమావేశాన్ని ఏర్పరచి, మతాచార్యుల చేత, సంఘ సంస్కర్తల చేత జాతి జాగృతం కోసం ఉపన్యాసాలు ఇప్పించారు. సంఘసేవకులతో కలిసి 1925లో ‘హిందూ ధర్మ పరిషత్’ స్థాపించి హరిజనోద్ధరణకు కృషి చేశారు.
1929 ఏప్రిల్ 6న వాడి జంక్షన్‌వద్ద ‘ఆంధ్ర వలంటీర్స్ కోర్ బృందం’ తరపున మహాత్మాగాంధీని కలుసుకొని సన్మానించారు. కృష్ణస్వామి విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేశారు. గ్రంథాలయాలను నెలకొల్పారు. కన్యా పాఠశాల, నారాయణగూడలోని బాలికల ఉన్నత పాఠశాల స్థాపనకు కృషి చేసి స్త్రీ విద్యకు పెద్దపీట వేశా రు. రాష్ట్రం నలుమూలలా ప్రైవేట్ పాఠశాలల స్థాపన కు కృషి సలిపారు. హిందీ భాషాభివృద్ధికి శ్రమించా రు. 1938లో ‘పీపుల్స్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్’ను స్థాపించారు. విద్యావ్యాప్తికి కృషి చేసిన కృష్ణస్వామికి ప్రభుత్వం ‘రాష్ట్ర విద్యా సలహాదారు బోర్డు సభ్యుని’గా, ‘ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ మెంబర్’గా నియమించి గౌరవించింది.
జాతినేత మహాభినిష్క్రమణం
చిన్నతనంలో కష్టాలు అనుభవించి స్వయంకృషితో వైభవోపేతమైన భవనం నిర్మించుకొని కుటుంబీకు లతో దివ్యమైన జీవితాన్ని కృష్ణస్వామి అనుభవించా రు. ‘చంద్రకాంత్ ప్రెస్’ నష్టాల పాలు కావడం, ఏకైక కుమారుడు ప్రకాష్ ఉద్యోగం సాధారణమైంది కావడం, తమ్ముళ్ళు, మేనమామ పిల్లల పోషణ, వారందరి పెళ్ళిళ్ళు పేరంటాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అయినప్పటికీ కృష్ణ స్వామి ఏనాడు ప్రజాసేవను మరువలేదు. ముదిరాజ్ జాతి అభ్యుదయానికి నిరంతరం కృషి చేశారు. 1963లో స్వంత ఇంటిని అమ్మివేశారు. వియ్యంకుడు శ్యామ్‌రావు ఇచ్చిన గౌలిగూడ రామమందిరం సమీ పంలోని ఇంటిలోకి కృష్ణస్వామి కుటుంబంతోసహా మారిపోయారు.
1965లో కృష్ణస్వామికి మొదటిసారిగా గుండె పోటు వచ్చింది. ఉస్మానియా ఆస్పత్రిలో నెల రోజులు చికిత్స పొంది, ఇంటికి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. కృష్ణస్వామి గారికి సలీమ్‌నగర్ కోఆపరేటివ్ సొసైటీలో 500 చ.గ.ల స్థలం కేటాయించడం జరిగింది. రుణం మంజూరు కావడంతో ఇంటి నిర్మా ణానికి ఆయన పూనుకున్నారు. గృహ నిర్మాణ కార్యక్ర మాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఇల్లు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఇదే సమయంలో 1967 ఆగస్టు 28న కృష్ణస్వామి 74వ జన్మ దినోత్సవం జరుపుకొన్నారు. 1967 డిసెంబర్ 19న గౌలిగూడలోని ఇంట్లో కృష్ణస్వామి ఎంతో సంతోషంగా ఉన్నారు. అప్పటికీ కుమార్తె సబిత వివాహం జరిగి కేవలం 12 రోజులే అయింది. సాయంత్రం 6 గంటల 10 నిము షాలకు రెండవమారు కృష్ణస్వామికి గుండెపోటు వచ్చింది. డాక్టర్‌ను పిలుచుకొని వచ్చే లేపే వారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ముదిరాజ్ జాతి యావత్ దుఃఖసాగరంలో మునిగి పోయింది. తమ జాతిహిత నేతకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
పల్లెబోయిన అశోక్,
తెలంగాణ ముదిరాజ్ మహాసభ
ప్రధాన కార్యదర్శి






