ఆర్టీఏ ప్రక్షాళన జరగాలి
30-05-2024 12:05 AM
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏకు చెందిన వివిధ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏక కాలంలో చేసిన ఆకస్మికంగా దాడుల్లో సిబ్బంది అవినీతి, దళారులతో కుమ్మక్కు విషయాలు బయట పడడంలో ఆశ్చర్యం లేదు. ఆర్టీఏ అంటేనే ప్రైవేట్ ఏజెంట్లకు నిలయం. ఏజెంట్‌ల సాయం లేకుండా అక్కడ ఏపనీ జరగదు. సాధారణ పౌరుల ను ఆర్టీఏ కార్యాలయాల్లో అస్సలు పట్టించుకోరు కానీ, ఏజెంట్లకైతే పెద్దపీట వేస్తారు. ఈ కార్యాలయాల సమగ్ర ప్రక్షాళన ఎంతైనా అవసరం. ఏసీబీ అధికారులు ఏదో నామమాత్రపు చర్యలతో కేసు లు మూసి వేయకుండా అవినీతిపరులకు శిక్షలు పడేలా చూడాలి. అప్పుడే మిగిలిన వారిలో భయం, ప్రజాసేవ పట్ల భక్తి ఉంటాయి.
-ప్రజ్ఞారావు, అక్కన్నపేట






