4 May, 2026 | 9:57 PM

ఈ నెల 10 లోపు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి

04-05-2026 08:34 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): 2027 జనాభా గణనలో భాగంగా  ఏప్రిల్ 26 నుండి మే 10వ తేదీ వరకు స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) కార్యక్రమం నిర్వహించబడుతుందనీ, జిల్లాలోని అన్ని కుటుంబాలు మే, 10 లోపు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుచున్న ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, పోలీస్ శాఖ, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మీడియా ప్రతినిధులు రాజకీయ ప్రతినిధులు ప్రతి కుటుంబం నుండి కుటుంబ యజమాని ఆన్లైన్ ద్వారా  స్వీయ జనగణన చేసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ లో చాలా సులువుగా  స్వీయ జనగణన ఆన్లైన్ ఫారం నింపుకోవచ్చని, కేవలం 5 నిమిషాల్లో పూర్తి అయ్యే స్వీయ జనగణన జనాభా గణనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

https://se.census.gov.in లో లాగిన్ అయి లొకేషన్ ఆన్ చేసుకొని ఎవరి ఇంటిలో వారు లొకేషన్ లో ఉండి స్వీయ జనగణన చేసుకోవచ్చు. మీ  మొబైల్ లో వచ్చిన గుర్తింపు సంఖ్యను మే 11 నుంచి ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్ కు చూపించాల్సి ఉంటుందనీ తెలిపారు.  సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు తుది గడువు కేవలం 5 రోజులు మిగిలి ఉన్నాయని, ఈలోపు జిల్లాలోని అందరూ కుటుంబ యజమానులు స్వీయ జనగణన పూర్తి చేసుకొని గుర్తింపు సంఖ్యను పొందాలని తెలియజేశారు. జనగణన జాయింట్ డైరెక్టర్ బి. లాజర్, జిల్లా సెన్సెస్ నోడల్ అధికారి సుల్తాన్ అలీ, సి.పి.ఓ హరికృష్ణ, డి.పి.ఓ రఘునాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.