4 May, 2026 | 9:57 PM

విద్యుత్ సిబ్బందికి లేదా 1912కు తెలియపర్చండి

04-05-2026 08:37 PM

విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్ఈ

ఖమ్మం టౌన్,(విజయక్రాంతి): జిల్లాలో గాలి వర్షాలు కారణంగా, చెట్లు కొమ్మలు, బ్యానర్లు విద్యుత్ లైన్ లపై పడి అనేక లైన్లు తెగిపోవడం పోల్స్ విరిగిపోవడం జరిగిందని సరిచేశామని ఏ విద్యుత్ సమస్య వచ్చిన తమ సిబ్బందికి తెలియపరచాలని లేదా 1912కి కాల్ చేయాలనీ విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్ఇ ఇనుగుర్తి శ్రీనివాస చారి తెలిపారు. సోమవారం అయన సిబ్బందితో పట్టణంలో, జిల్లాలోనో వివిధ ప్రదేశాల్లో తెగిపడిన విద్యుత్ తీగలను సిబ్బందితో తొలిగింపచేసి, విరిగిన స్థంభాలను మార్పించారు.

భారీగా చెట్లు పడడం వల్ల అనేక పోల్స్, లైన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని, క్షేత్రస్థాయిలో స్టాప్ ని, కావలసిన సామాగ్రిని అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిరంతరాయంగా విద్యుత్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వినియోదారులు గాలి దుమ్ములు వర్షాలు కురుస్తున్నప్పుడు తెగిపోయిన లైలను విరిగిపోయిన కరెంటు స్తంభాలను తాకరాదని తెలియజేయాలి.