4 May, 2026 | 10:03 PM

యోగ నిత్యజీవితంలో భాగం కావాలి: సిఐ గురుస్వామి

04-05-2026 08:49 PM

బోత్,(విజయక్రాంతి): యోగ నిత్య జీవితంలో భాగం కావాలని బోత్ సీఐ గురుస్వామి ఎస్సై పురుషోత్తంలో పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వేసవి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని క్రీడల వల్ల శారీరకంగా ఎదుగుదల ఉంటుందని పేర్కొన్నారు.

ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనిషిలో దురలవాట్లు దూరం అవుతాయని ధ్యానంతో మేధాశక్తి పెరుగుతుందన్నారు .ఆత్మ రక్షణ కోసం కరాటే అవసరం కాగా ఏకాగ్రత కోసం ధ్యానం అవసరమన్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఈనెల 30 వరకు వేసవి శిబిరాలను కొనసాగిస్తామన్నారు, చిన్న పిల్లలు సెల్ఫోన్లకు దూరంగా ఉండడానికి ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలన్నారు,