11-11-2025 11:41:38 PM
హిడ్మా, దేవా సొంతూరికి ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ
చర్ల, నవంబర్ 11 (విజయక్రాంతి): మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, బర్సేదేవాల స్వగ్రా మం ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తి గ్రామానికి మంగళవారం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ వెళ్లారు. వారిని ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మావోయిస్ట్ నాయకులు హిడ్మా, బర్సేదేవా తల్లులు ఒక వీడియోను విడుదల చేసి, వారిని తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయ్‌శర్మ మాట్లాడుతూ, ‘నేను హిడ్మా, బర్సేదేవాల తల్లిని కలిశాను. వారి పునరావాసం కోసం విజ్ఞప్తి చేశాను. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకముందే వారు తిరిగి రావాలని నేను కోరుతున్నాను. ప్రభుత్వం వారిని జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పారు.