12-11-2025 12:00:00 AM
ఆరుగురు మావోయిస్టుల మృతి
రాయ్‌పూర్/చర్ల: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం లో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య మం గళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతల సంచారం ఉందనే సమాచారం మేరకు దంతెవాడ పోలీస్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ), ఎన్టీఎఫ్ సంయుక్త బృందాలు ఆ ప్రాంతాన్ని మోహరించాయి.
మావోయిస్టుల కోసం భద్రతా దళాలు అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతుండగా, వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఇరు వర్గాల మధ్య సుమారు ఆరగంట పాటు భీకర పోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యారు. జవాన్లు తర్వాత ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఆటోమేటిక్ ఆయుధాలు, రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, పేలు డు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.