వేధింపుల నుంచి రక్షించాలని మహిళ ఫిర్యాదు
22-06-2024 01:07 AM
ఎల్‌బీనగర్, జూన్ 21: ఓ వ్యక్తి పోలీసు అధికారినంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ శుక్రవారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరుకు చెందిన ఓ మహిళను ఏసీబీ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌స్పెక్టర్‌ను అంటూ శేఖర్ అనే వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తి నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపింది.






