11 May, 2026 | 8:51 PM

దక్షిణ కొరియా ప్రతినిధి బృందం పర్యటన

22-06-2024 01:06 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే బోక్, తెలంగాణ రిపబ్లిక్ ఆఫ్ కొరి యా కాన్సుల్ జనరల్ సురేష్ చుక్కపల్లితో కలిసి శుక్రవారం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సీఎస్సీ ఎగ్జికూటివ్ కమిటీ సభ్యులతో చర్చలు జరిపారు. పీపీపీ పద్దతిలో పనిచేస్తున్న ఈ సంస్థ పరిశ్రమలకు, సమాజానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకున్నారు. ఎస్సీఎస్సీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ రమేష్ కాజా, పద్మప్రియ వారికి వివరించారు. 2006లో తమ సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి నగరాభివృద్ధికి చేస్తున్న కృషిని తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మొహంతి మాట్లాడుతూ.. ఎస్సీఎస్సీలో నిపుణులు 18 ఏళ్లుగా సమాజానికి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.