రెస్టారెంట్‌కు పదివేల జరిమానా
22-06-2024 01:07 AM
రాజేంద్రనగర్, జూన్ 21 : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుళ్లిన పదార్థాలను వడ్డించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చంద్ర హెచ్చరిం చారు. శుక్రవారం కార్పొరేషన్‌లోని ప్రధాన హోటళ్లు, తినుబండారాల షాపులను తనిఖీ చేశారు. కార్పొరేషన్ పరిధిలోని జీషాన్ హోటల్‌లో కుళ్లిన చికెన్, మటన్, పాయా వడ్డిస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన ఆహార పదార్థాలను సీజ్ చేసి హోటల్ యాజమాన్యానికి రూ.10 వేల జరిమానా విధించారు. కార్పొరేషన్‌లో రెస్టారెంట్లు, హోటళ్లు నాణ్యమైన ఆహార పదార్థాలనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని, తమ దృష్టికి ఏవైనా ఫిర్యాదులు వస్తే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.






