calender_icon.png 11 January, 2026 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజా తగిలి ప్రాణాపాయ స్థితిలో చిన్నారి

10-01-2026 12:00:00 AM

మెడ చుట్టూ 20 కుట్లు.. మెడ కోసుకుపోయి.. బాలుడికి తీవ్ర గాయాలు 

నిజామాబాద్ జనవరి 9 (విజయ క్రాంతి): చైనా మాంజా వినియోగం వద్దని పోలీసులు, అధికారులు పదేపదే హెచ్చరించినప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. యథేచ్చగా వాటిని విక్రయిస్తూన్నారు. ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో చైనా మాంజా మేడం కోయడంతో నిజామాబాద్ కు చెందిన నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాంజా కోసుకుపోవడంతో మెడ బాలుని మెడకు ఏకంగా 20 కుట్లు పడ్డాయి. నిజామాబాద్‌కు చెందిన శ్రీహాన్ (4) అనే బాలుడు సంక్రాంతి పండుగ జరుపుకు నేందుకు మెట్ పల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు.

పట్టణంలోని దుబ్బవాడలో గల ఇంటి ముందు శ్రీహాన్ ఆడుకుంటుండగా బాలుడి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. చైనా మాంజా పట్టుకొని వేరే చిన్నారి పరిగెడు తుండగా అది ప్రమాదవశాత్తు బాలుడి మెడ ను కోసుకుంటూ వెళ్ళింది. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి దుస్తులన్నీ తడిచిపోయి కుప్ప కుప్పకూలిపోయాడు. శ్రీహాన్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటీనా నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

దీంతో బాలుడికి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు మెడ చుట్టూ ఏకంగా 20 కుట్లు వేశారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చైనా మాంజాను వెంటనే బ్యాన్ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దేవుడి దయతో తమ బిడ్డ ఎలాంటి ప్రాణపాయం లేకుండా బయటపడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.