10-01-2026 12:00:00 AM
మరిపెడ, జనవరి 9 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పామండ తండా గ్రామపంచాయతీ ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఆర్టీసీ బస్సు కల నెరవేరింది. ఇంతకాలం బస్సు సౌకర్యం లేక ఆ గ్రామస్తులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. విద్యార్థులు, రైతన్నలు, గ్రామస్తులు తమ అత్యవసరాల కోసం ప్రైవేట్ వాహనాల ద్వారానే ప్రధాన రహదారి వరకు చేరుకొని అక్కడనుండి బస్సులు లేదా ఆటోల ద్వారా మండల, జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. సర్పంచ్ ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది.
అనుకున్నట్టుగానే ఆ గ్రామస్తులకు బస్సు సౌకర్యం కల ఇప్పుడు సహకారమైంది. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పామండ తండా గ్రామానికి మహబూబాబాద్ నుండి సూర్యాపేట వాయ తాళ్ళ ఊకల్, తానంచర్ల మీదగా బస్సు సర్వీస్ను ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాలి ఉమ్లా ఉప సర్పంచ్ గుగులోతు ఈరాణి, వార్డు మెంబర్లు బిచ్చు, నరేష్, బద్రి, అరుణ ,సునీత, తండా పెద్దలు రెడ్డి, గోపి, వెంకన్న, బాలరాజు, రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.