18 May, 2026 | 1:28 AM

జాతీయ స్థాయిలో మెరిసిన చిన్నారి

18-05-2026 12:16 AM

కూచిపూడి నృత్యంలో రాణిస్తున్న బింగి షష్టిక 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మే 17: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన బింగి అనిల్ కుమార్  రమాదేవి దంపతుల కుమార్తె బింగి షష్టిక చిన్న వయస్సులోనే కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. కేవలం 8 సంవత్సరాల చిరు ప్రాయంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ వేదికలపై అత్యుత్తమ ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

హైదరాబాద్లోని శ్రీ సాయిచరణ్ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నృత్య గురువు డాక్టర్ మధుమతి వద్ద శిక్షణ పొందుతున్న షష్టిక,ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశి విశ్వనాథ్ ఆలయం,అయోధ్య రామ మందిరంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి అందరిని అలరించింది.చిన్న వయస్సులోనే జాతీయ స్థాయి వేదికలపై ప్రతిభ చాటుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం తల్లిదండ్రులకు,గ్రామానికి గర్వకారణమని పలువురు అభినందిస్తున్నారు.